spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Mumbai Preview Show Talk: 'ధురంధర్ 2' ముంబాయి ప్రివ్యూ షో టాక్...

Dhurandhar 2 Mumbai Preview Show Talk: ‘ధురంధర్ 2’ ముంబాయి ప్రివ్యూ షో టాక్ ఇదే.. క్లైమాక్స్ లో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్..!

Dhurandhar 2 Mumbai preview show talk: సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అసలు ఈ సినిమా చెప్పిన సమయానికి వస్తుందా లేదా అనే అనుమానాలు ఆడియన్స్ లో ఉండేవి, కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ రీసెంట్ గానే అన్ని భాషల్లోనూ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. భారీ అంచనాలు ఉండడం వల్లనో ఏమో తెలియదు కానీ , ట్రైలర్ కి ఆడియన్స్ నుండి గొప్ప రెస్పాన్స్ ఏమి రాలేదు. మొదటి భాగం లాగానే , రెండవ భాగం లో కూడా యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. ‘ఇక పాకిస్థాన్ భవిష్యత్తు హిందుస్థాన్ నిర్ణయిస్తుంది ‘ అంటూ ట్రైలర్ చివర్లో వచ్చే డైలాగ్ ని చూసే చెప్పేయొచ్చు , ఈ సినిమా ని ఎలా తెరకెక్కించారు అనేది.

Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..?

అయితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని ముంబై లో పాత్రికేయులకు , పలువురు సినీ ప్రముఖులకు వేసి చూపించారు. వాళ్ళ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘ధురంధర్ ‘ చిత్రానికే మూవీ లవర్స్ మెంటలెక్కిపోయారు, ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ మొదటి భాగం కంటే ఎన్నో రేట్లు అద్భుతంగా ఉందని, ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ ఏమైపోతారో అంటూ ఈ చిత్రాన్ని చూసిన తర్వాత చెప్పారట. అంతలా ట్విస్ట్ ఇచ్చే సన్నివేశం ఏమి అయ్యుంటుంది ?, అంటే పార్ట్ 3 కూడా ఉండబోతుందా ఏంటి ? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ అంశంపై చర్చించుకుంటున్నారు. స్టోరీ విషయానికి వస్తే రెహమాన్ డెకాయిట్ చనిపోయిన తర్వాత ల్యారీ నగరం లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ల్యారీ నగరం పై హీరో పూర్తి స్థాయిలో ఎలా పట్టు సాధించాడు. పాకిస్థాన్ రాజకీయాలను శాసిస్తూ అక్కడి ఉగ్రవాదాన్ని ఎలా మట్టి కురిపించాడు, ఈ ప్రయాణం లో హీరో ఎదురుకున్న సవాళ్లు ఏంటి ? అనేది ఆసక్తికరమైన అంశాలుగా పరిగణిస్తున్నారు. 26/11 ఢిల్లీ లోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టులు చేసిన ఎటాక్ ని తల్చుకున్నప్పుడల్లా మన రక్తం ఉడికిపోతూ ఉంటుంది. ఎంతో మంది అమాయకులను ఈ దుర్మార్గులు పొట్టనపెట్టుకున్న. ఎలా ప్లాన్ చేసి ఎటాక్స్ చేశారో ‘ధురంధర్ ‘ చిత్రం లో చూపించారు. అలా ఎటాక్ చేసిన ఏ ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలబోనని హీరో మొదటి భాగం లో సవాలు విసురుతాడు. రెండవ భాగం మొత్తం ఎలా వారిపై రివెంజ్ తీర్చుకున్నాడు అనే దానిపైనే స్క్రీన్ ప్లే నడుస్తుంది అట. చూడాలి మరి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Oktelugu Epaper