Rohit Sharma : 2007లో టి20 వరల్డ్ కప్ ను ఐసీసీ ప్రారంభించింది. ప్రారంభ ట్రోఫీని టీమ్ ఇండియా గెలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద విజయం సాధించి.. ట్రోఫీని అందుకుంది. తద్వారా టి20 ఫార్మాట్ లో తొలి అడుగును బలంగా వేసింది.
2007 తర్వాత టీమ్ ఇండియా మరోసారి t20 వరల్డ్ కప్ సాధించడానికి దాదాపు 17 సంవత్సరాల సమయం పట్టింది. ఇంత సుదీర్ఘ సమయంలో టీమిండియా అనేక పర్యాయాలు టి20 వరల్డ్ కప్ గెలవడానికి అవకాశం వచ్చినప్పటికీ.. దురదృష్టం వెంటాడింది. ఈ క్రమంలో టీమిండియా రోహిత్ నాయకత్వంలో 2024లో టి20 వరల్డ్ కప్ సాధించింది. తద్వారా 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించింది.
2024 లో టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మిల్లర్ కొట్టిన భారీ షాట్ కు బంతి చాలా ఎత్తు లేచింది. ఆ సమయంలో సూర్య కుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద అత్యంత చాకచక్యంగా పరుగులు పెడుతూ బంతిని అందుకున్నాడు. దీంతో మిల్లర్ అవుట్ అయ్యాడు. అతడు అవుట్ కాగానే మ్యాచ్ స్వరూపం మొత్తంగా మారిపోయింది. అప్పటిదాకా టీం మీడియాకు ఆశలు లేని సమయంలో.. ఒక్కసారిగా మ్యాచ్ టీమ్ ఇండియా వైపు టర్న్ అయింది. దీంతో రోహిత్ సేన విజేతగా నిలిచింది.
ఈ విజయ వెనుక ఉన్న ఆసక్తికరమైన పరిణామాన్ని ఇటీవల రోహిత్ శర్మ ఓ కార్యక్రమంలో పంచుకున్నాడు. ” మిల్లర్ కొట్టిన ఆ బంతి తన చేతి వెళ్ళళ్ళో స్టక్ అయిందని సూర్య కుమార్ యాదవ్ చెప్పాడు. ఒకవేళ ఆ బంతి గనుక అతడి చేతి వేళ్లలో స్టక్ అవ్వకుండా ఉండి ఉంటే.. కచ్చితంగా అతడిని జట్టు నుంచి తొలగించేవాడిని (నవ్వుతూ)” అంటూ రోహిత్ శర్మ చెప్పాడు. నాడు టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ టి20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా నడిచారు. ఇక 2026 లో సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా మరో మారు పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్ అందుకుంది. ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టును ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. వరుసగా రెండవసారి.. మొత్తంగా మూడోసారి t20 వరల్డ్ కప్ అందుకుంది టీం ఇండియా.