
పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. ఇంతకు ముందు ఆదివారం ధరలు పైకి కదలగా ఒక రోజు విరామం తర్వాత చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా మరోసారి పెట్రోల్ లీటర్ కు 23 పైసలు, డీజిల్ లీటర్ కు 27 పైసల వరకూ పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.44, డీజిల్ ధర రూ. 84.32కు చేరింది. ముంబైలో పెట్రోల్ రూ. 99.71, డీజిల్ రూ. 91.57కు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 97.12, డీజిల్ రూ. 91.92కు చేరింది.