
ఫేస్ బుక్ హ్యాక్ చేసి.. రూ. 2.85 లక్షలు వసూలు చేసిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం.. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి గంగస్తాన్ కు చెందిన డి. శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ అకౌంట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి పేరుపై మరో ఫేక్ ఆకౌంట్ సృష్టించి అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయంటూ ఫేస్ బుక్ మెస్సేజర్, వాట్సాప్ ద్వారా సందేషం పంపించారు. ఇది నిజమని నమ్మిన శ్రీనివాస్ స్నేహితులు పైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్ కు రూ. 2 లక్షల 85 వేలు బదిలీ చేశారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.