
దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. ఇప్పటికే ధరలు ఆల్ టైమ్ గరిష్ఠస్థాయికి చేరగా తాజాగా లీటర్ పెట్రోల్ పై 28 పైసలు, డీజిల్ పై 32 పైసలు వరకు పెరిగింది. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 96.93, డీజిల్ రూ. 87,69కి పెరిగింది. మరో వైపు ముంబైలో పెట్రోల్ ధర రూ. 103కి చేరింది. హైదరాబాద్ ల పెట్రోల్ రూ. 10.74, డీజిల్ రూ. 95.59కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో చమురు కంపెనీలు ధరలను పెంచాయి.