
రిషబ్ పంత్ ఆటగాడిగా, నాయకుడిగా అభివృద్ధి చెందుతున్నాడని భారత మాజీ స్పిన్నర్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యడు ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. రాబోయే సంవత్సరాల్లో రిషభ్ పంత్ పరిణతి చెందిన నాయకుడిగా అభివృద్ధి చెంది భవిష్యత్ లో భారత జట్టుకు కెప్టెన్ అవుతాడని ఓజా విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టును నడిపించే విధానం, బ్యాటింగ్ లో ఇదే విధమైన పరిపక్వతను కొనసాగిస్తే పంత్ భవిష్యత్ లో భారత జట్టు కెప్టెన్ అవుతాడనే నమ్మకం నాకుంది అని చెప్పారు.