
ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో మీరు ఏటీఎం సెంటర్ కు వెళ్లాల్సిన పని లేదు. మీ ఇంటి వద్దనే డబ్చులు విత్ డ్రా చేసుకోవచ్చు. మీ ఇంటి వద్దకే ఏటీఎం వస్తుంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. 19 పట్టణాల్లో మొబైల్ ఏటీఎం సర్వీసులు ప్రారంభించామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది.