Homeఎంటర్టైన్మెంట్ఎక్స్ క్లూజివ్ : ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ డిటైల్స్ !

ఎక్స్ క్లూజివ్ : ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ డిటైల్స్ !

Prabhas New Project
నేషనల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి అనేక రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా పై అధికారిక అప్ డేట్ కావాలంటూ గత కొంత కాలంగా ట్విట్టర్ లో సినిమా మేకర్స్ కి మెసేజ్ లు పెడుతూ వస్తున్నారు. అయితే, సినిమా యూనిట్ ప్రస్తుత ప్లాన్ ప్రకారం ఈ దీపావళికి ఈ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా లాంచ్ చేసి.. అప్పటి నుండే షూటింగ్ ప్రారంభించనున్నారు. నిజానికి ఈ సినిమా జూన్ లేదా జూలైలో సెట్స్ పైకి వెళ్ళాలి.

అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తమ సినిమా షూటింగ్ వాయిదా వేశారు నాగ్ అశ్విన్ టీమ్. ఇక మొదటినుండీ ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా కథ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించడానికి నాగ్ అశ్విన్ భారీగానే ప్లాన్ చేస్తున్నాడు.

ఇంతకీ ఈ సినిమా నేపథ్యం ఏమిటంటే.. మొత్తం ఓ దీవిలో సినిమా జరుగుతుందట. ప్లాష్ బ్యాక్ లో ఈ దివి సీన్స్ వస్తాయని.. అలాగే సినిమాలో మూడు కాలాలకు సంబంధించిన కథ ఉంటుందని.. అయితే అన్నిటిలోకల్లా దివి తాలూకు సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయ్యాయి. ప్రసుతం స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు.

ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ కథలో రెండు విభిన్న పాత్రలను సృష్టించాడని.. పైగా పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా ప్లాన్ చేస్తున్నాడని.. అందుకే అన్ని భాషల వారికి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని టీమ్ నమ్మకంగా ఉంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని భారీగా నిర్మించనున్నారు. మొత్తం సాంకేతిక బృందాన్ని కూడా హాలీవుడ్ లోని ప్రముఖులనే తీసుకుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular