
కరోనా సంక్షోభం వేళ దేశంలో సంభవిస్తున్న విపత్తులు, వాటిని ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరు గురించి ప్రధాని నరేంద్రమోదీ వివరించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని గత రెండు వారాల్లో వచ్చిన రెండు తుపాన్లు, వాటిని ఎదుర్కొన్న తీరును గుర్తు చేశారు. తుపాను సమయంలో సహాయక చర్యల్లో పాల్గొని లక్షలాది మందికి సేవలు అందించిన వారికి సెల్యూట్ చేస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.