కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గడంతో పశ్చిమ బెంగాల్ లో లాక్ డౌన్ నియంత్రణలకు పలు సడలింపులు ప్రకటించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందిని విధుల్లోకి అనుమతిస్తామని సీఎం మమతా బెనర్జీ గురువారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాల తరహాలో తాము లాక్ డౌన్ విధించలేదని,కఠిన నియంత్రణతోనే వైరస్ కట్టడి చేస్తామని చెప్పారు. ఇకపై రిటైల్ షాపులను మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అనుమతిస్తారు. ఐటీ సెక్టార్ ను రెండు షిప్టుల్లో పనిచేసే వెసులుబాటు కల్పించారు. రెస్టారెంట్లు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ తెరిచేందుకు అనుమతించారు.