ప్లాట్ ఫామ్ టికెట్ ధరల తగ్గింపు

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో పంచిన రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారి వేళ స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు టికెట్ ధరను రూ. 50 గా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అన్ రిజర్వ్ డ్ ఎక్సప్రెస్, సాధారణ రైళ్లను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాట్ ఫామ్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తగ్గించిన ధరల ప్రకారం.. సికింద్రాబాద్ […]

Written By: Suresh, Updated On : July 26, 2021 6:36 pm
Follow us on

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో పంచిన రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారి వేళ స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు టికెట్ ధరను రూ. 50 గా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అన్ రిజర్వ్ డ్ ఎక్సప్రెస్, సాధారణ రైళ్లను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాట్ ఫామ్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తగ్గించిన ధరల ప్రకారం.. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లల్లో ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ. 10, సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో ప్లాట్ ఫామ్ ధర మాత్రం రూ. 20 ఉంటుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.