ఫీల్ గుడ్ సీన్స్ లో చైతు ‘థాంక్యూ’ !

వినూత్నమైన చిత్రాలకు విక్రమ్ కె కుమార్ పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా “థాంక్యూ” అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. కాగా ఈ చిత్రంలో చైతు ఒక ఎన్నారైగా నటిస్తున్నాడని.. చైతు పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో స్టార్ట్ చేశారు. […]

Written By: admin, Updated On : July 26, 2021 6:41 pm
Follow us on

వినూత్నమైన చిత్రాలకు విక్రమ్ కె కుమార్ పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా “థాంక్యూ” అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. కాగా ఈ చిత్రంలో చైతు ఒక ఎన్నారైగా నటిస్తున్నాడని.. చైతు పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో స్టార్ట్ చేశారు. చైతు పై కొన్ని ఫీల్ గుడ్ సీన్స్ తీస్తున్నారట.

ఇక చైతు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి ఇండియాకి వస్తాడని.. ఈ జర్నీలో గొప్ప సెంటిమెంట్ తో సాగే సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రం నేపథ్యం చాలా కొత్తగా ఉంటుందని.. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా ఇంటెన్సిటీతో కూడిన నటనతో ఉంటుందట. నిజానికి ఈ సినిమా కథ గురించి మరో రూమర్ కూడా బాగా వినిపిస్తోంది.

ఓ మధ్యతరగతి అబ్బాయి ఎన్నో కష్టాలు పడి.. ఇంటర్ నేషనల్ గా ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎలా మారాడు ? ఈ క్రమంలో అతను ఎలాంటి అపజయాలు పొందాడు అనే కొన్ని సీన్స్ చాలా బాగుంటాయట. అదేవిధంగా తన విజయ పథంలో తనకి సహకరించిన వారందరికీ అతను థాంక్స్ ఎలా చెప్పాడు అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్.

మొత్తమ్మీద ఈ క్రమంలో చైతు పాత్ర ఎలాంటి అనుభవాలు పొందాడు, అలాగే ఎలాంటి ఎమోషన్స్ జనరేట్ చేస్తాడు ? చివరకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే పాయింట్స్ మీద సినిమా ఎండింగ్ ఉంటుందట. మరి చూడాలి పై రెండు పాయింట్స్ లో ఈ సినిమా ఏ పాయింట్ కి సంబంధించి ఉంటుందో. ఒక్కటి అయితే నిజం అట.. ఈ సినిమాలో చైతు చాలా కొత్తగా కనిపిస్తాడట.