కరోనా సెకండ్ వేవ్ చాలా వరకూ తగ్గుముఖం పట్టింది. దాంతో సినీ పరిశ్రమలో కొత్త సినిమాల షూటింగ్ పనులు స్పీడ్ అందుకున్నాయి. ఎలాగూ మరి కొన్నిరోజుల్లో థియేటర్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి.. మేకర్స్ కూడా ప్యాచ్ వర్క్ కి సంబంధించిన షూట్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు.
అలాగే మరికొన్ని ప్రాజెక్ట్‌లు కూడా షూటింగ్స్ కి రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఉదయం రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లకు సంబంధించి షూట్ స్టార్ట్ చేశారు. అందులో ఒకటి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమా షూట్ తిరిగి ఈ రోజు పట్టాలెక్కింది.
కాగా ఈ రోజు షూట్ లో పవన్-రానాలపై యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను కూడా షేర్ చేసింది. పోస్టర్ లో పవన్‌కల్యాణ్ పోలీస్ దుస్తుల్లో వెనుక నుంచి కనిపించి బాగా ఆకట్టుకున్నారు. ఇక ఈ పోస్టర్ లో ‘భీమ్లానాయక్ ఆన్ డ్యూటీ’ అని మేకర్స్ ఒక మెసేజ్ ను కూడా పోస్ట్ చేసింది. మొత్తానికి ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు ‘భీమ్లానాయక్’ అని అర్థమవుతోంది.
ఇక నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న మరో సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా ఈ రోజు పూర్తి అయింది. నాని ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని తెలిపారు. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది.