
ఐపీల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో స్టార్ లకు కొదవ లేదు. అయినా ఇంతవరకు ఒక్కసారి కూడా కప్ గెలవకపోవడంతో ఫాన్స్ చాల నిరాశకు గురవుతున్నారు. ఈ సారి ఎలాగైనా కప్పు గెలవాలనే ఉద్దేశంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు “మెంటర్ షిప్” అనే కొత్త వ్యూహాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా జట్టులోని యువ ఆటగాళ్లకు సీనియర్ ఆటగాళ్లు దిశ నిర్ధేశం చెయ్యనున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ఈ కొత్త వ్యూహం జట్టులోని యువ ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్ మైక్ హాసన్ తెలిపారు.
Also Read: ఐపీఎల్ వైరల్:హైదరాబాదీ కా మామ.. విలియమ్సన్ రాకతో సన్‘రైజ్’