
తన సొంత నియోజకవర్గం కొడంగల్ కు ప్రతిపాదించిన ఎత్తిపోతలను ఎత్తేసిన కేసీఆర్ తీరును రేవంత్ రెడ్డి కడిగేశారు. తెలుగు రాష్ట్రా ల సీఎంల మధ్య అపెక్స్ కౌన్సిల్ భేటి సందర్భంగా రేవంత్ రెడ్డి లేఖ ద్వారా నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల స్కీంను కేసీఆర్ కు గుర్తు చేస్తూ ఘాటు లేఖ రాశారు. ఈ లేఖ హాట్ టాపిక్ గా మారింది.
Also Read: కట్ చేసిన జీతాలు నాలుగు వాయిదాల్లో చెల్లింపులు
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు లేఖ రాశారు. జల వివాదాలపై కేసీఆర్ ను నిలదీశారు. రాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ స్కీంపై తాను కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశానని.. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారని తెలిపారు.ఇప్పటికైనా ఈ ప్రాజెక్టును అపెక్స్ కౌన్సిల్ భేటిలో లేవనెత్తి న్యాయం చేయాలని లేదంటే రైతు ద్రోహిగా మరోసారి మీరు మిగిలిపోతారని రేవంత్ రెడ్డి లేఖలో విమర్శించారు.
ఈ సందర్భంగా ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణ పేట్-కొడంగల్ ఎత్తిపోతల అంశాన్ని కూడా చేర్చాలని లేఖలో కోరారు.పోతిరెడ్డిపాడు,సంగమేశ్వరం ఎత్తిపోతల పేరుతో ఏపీ జలాల దోపిడీకి తెగబడ్డారని.. తెలంగాణ హక్కులను కాపాడడం అటుంచి కాలరాసేందుకు తెగబడ్డారన్నారు.
ఉమ్మడి ఏపీలో ఆమోదం పొందిన నారాయణ్ పేట్-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తో వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు సదుపాయం కల్పించవచ్చని.. ఈ ప్రాజెక్టును అటకెక్కించారని కేసీఆర్ తీరును రేవంత్ ఎండగట్టారు.
Also Read: మీ ఆస్తులు ఇక భద్రం: ఓనర్ లేకున్నా ఇంటికొచ్చి నమోదు చేస్తారు
ఏపీతో వివాదం విషయంలో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును రేవంత్ రెడ్డి లేఖలో ఎండగట్టారు. మబ్బుల్లో నీళ్లు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసిన చందంగా కేసీఆర్ మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ సెటైర్లు వేశారు. కృష్ణా నది విషయంలో ప్రాజెక్టులకు రీడిజైనింగ్ చేసి తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా మారుతున్నాయన్నారు. మీది మూర్ఖత్వమా? లేక అతి తెలివా అర్థం కావడం లేదన్నారు.