Ram Charan Daughter KlinKaara
Ram Charan Daughter: పెళ్ళైన పదేళ్లకు రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు అయ్యారు. 2012లో వారికి వివాహం జరిగింది. అపోలో గ్రూప్ వారసురాలైన ఉపాసన ను రామ్ చరణ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏళ్ళు గడుస్తున్నా ఉపాసన తల్లి కాలేదు. ఈ క్రమంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. విమర్శలకు చెక్ పెడుతూ ఉపాసన 2023 జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు క్లిన్ కార అని పేరు పెట్టారు లలితా సహస్ర నామం నుండి ఈ పేరు ఎంచుకున్నట్లు చిరంజీవి వెల్లడించారు.
క్లిన్ కార పుట్టి నెలలు గడుస్తున్నా ప్రపంచానికి చూపించలేదు. పలుమార్లు రామ్ చరణ్ దంపతులు క్లిన్ కారను పబ్లిక్ లోకి తీసుకొచ్చారు. అయితే క్లిన్ కార ముఖం కనిపించకుండా జాగ్రత్తపడేవారు. ఫ్యామిలీ ఫోటోలలో క్లిన్ కార ముఖం మీద ఎమోజీ పెట్టి కవర్ చేసేవారు. క్లిన్ కార ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి అందరిలో ఉంది. ఎట్టకేలకు క్లిన్ కార లుక్ రివీల్ అయ్యింది.
రామ్ చరణ్ బర్త్ డే నేపథ్యంలో భార్య ఉపాసన, కూతురు క్లిన్ కారతో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఉపాసన చేతుల్లో ఉన్న క్లిన్ కార ముఖం కెమెరా కంటికి చిక్కింది. దాంతో క్లిన్ కార లుక్ మొదటిసారి బయటపడింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక క్లిన్ కార చాలా క్యూట్ గా ఉందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్లిన్ కారను రామ్ చరణ్ దంపతులు అపురూపంగా పెంచుకుంటున్నారు.
క్లిన్ కార కోసం ఒక గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. క్లిన్ కార కేర్ టేకర్ కి నియమించారు. ఆ కేర్ టేకర్ జీతం నెలకు రూ. 1.5 అని సమాచారం. ఒక పాపను చూసుకునే మహిళకు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ జీతం ఇస్తున్నారు. క్లిన్ కార రామ్ చరణ్ దంపతులకు అంత ప్రత్యేకం అన్నమాట. మరోవైపు నేడు రామ్ చరణ్ 39వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ మూవీ నుండి జరగండి… అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.
రామ్ చరణ్ కూతురి ముఖాన్ని చూసారా l Ram Charan Daughter Klin Kaara Face Reveal l #ramcharan #ramcharanforever #heroramcharan #megapowerstar #globalstar #globastarramcharan #upasana #klinkaarakonidela #klinkaara #tirumala #tirumalanews #tirumalatemple #telugushorts pic.twitter.com/5wgTgiejPK
— PrathiVaartha (@PrathiVaartha) March 27, 2024