rajamouli varanasi movie : ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా రాజమౌళి చేసే సినిమాలకు చాలా ప్రత్యేకమైన స్థానమైతే ఉంది. ఆయన పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని చాలా వరకు పెంచాడు. ‘బాహుబలి’ సినిమాతో మొదటి పాన్ ఇండియా సినిమా చేసి సక్సెస్ ని సాధించిన ఆయన ఆ తర్వాత చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు మరోసారి ‘వారణాసి’ సినిమాతో అంతకుమించిన సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. మరి వారణాసి సినిమాలో సైతం అంతకుమించిన ఎలిమెంట్స్ పెడుతున్నారట. సినిమా మొత్తం ఒకెత్తయితే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసమే దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారట. ఇక ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఈ యాక్షన్ సీక్వెన్స్ 15 నిమిషాల పాటు కొనసాగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.
హాలీవుడ్ స్టంట్ మాస్టర్ సారధ్యంలో ఈ ఫైట్ చేస్తున్నారట. ఆ ఫైట్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని రాజమౌళి ఆయన టీమ్ అభిప్రాయపడుతున్నారు. మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ ఫైట్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుంది. అనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది? ప్రేక్షకులందరిని మెప్పిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక రాజమౌళి మీద చాలావరకు ప్రెషర్ ఉంది. ఈ సినిమాను 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు 1500 కోట్లకు పైన బడ్జెట్ అవుతుందట.
బడ్జెట్ పెరుగుతుందనే ప్రేజర్ ను రాజమౌళి హ్యాండిల్ చేస్తూనే ఆయన ఒక అద్భుతమైన ఔట్ పుట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలో ప్రతిదీ వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…