Telangana Rains: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవచచని, గంటకు 40 నుంచి 50 కి. మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండతో పాటు వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది.