TDP One Year Review by ABN: ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో టిడిపికి వ్యతిరేకంగా పెద్దగా వార్తలు రావు. ఇప్పుడు టిడిపి ఆధ్వర్యంలో కూటం ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక్క వార్త కూడా వ్యతిరేకంగా వచ్చే అవకాశం లేదు. కానీ ఈ అభిప్రాయాన్ని రాధాకృష్ణ తప్పు అని నిరూపించారు. అంతేకాదు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాధాకృష్ణ తనదైన మార్క్ విశ్లేషణ చేశారు. అవినీతి, అక్రమాలు, ఇసుక కుంభకోణాలు, స్మార్ట్ మీటర్ల వ్యవహారాలు, భూ దందాలు.. ఇలా ప్రతి అంశం మీద వేమూరి రాధాకృష్ణ తన చానల్ లో ప్రస్తావించారు. ఒక రకంగా కూటమి ప్రభుత్వం తీరును తూర్పార పట్టారు.
భూ దందాలు, సెటిల్మెంట్లు
గత వైసిపి ప్రభుత్వం లో భూ దందాలు విపరీతంగా చోటుచేసుకున్నాయని.. సెటిల్మెంట్లు అడ్డగోలుగా జరిగిపోయాయని.. ఇసుక కుంభకోణాలకు లెక్కలేదని.. స్మార్ట్ మీటర్లతో అడ్డగోలుగా వ్యవహరించారని.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనేక కథనాలను ప్రసారం చేసింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలోనూ అలాంటి వ్యవహారాలు సాగుతున్నాయని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తన కథనాలలో స్పష్టం చేసింది.. పైగా ప్రభుత్వం నడుస్తున్న తీరు కూడా సక్రమంగా లేదని ఏకంగా చంద్రబాబు నాయుడికే తలంటే కార్యక్రమం చేపట్టింది.
చివరికి నీతి, నిజాయితీ లేని APజ్యోతి కూడా అసహ్యించుకునేంత అవినీతి….. pic.twitter.com/xrYALkWSne
— Krishnaveni Paleti (@KrishnaveniYCP) June 12, 2025
వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రచారం
వాస్తవానికి ఫ్యాన్ పార్టీ అంటే, జగన్ అంటే మండిపడే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. చంద్రబాబు నాయుడికి అడుగడుగునా హారతి పట్టే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇలాంటి కథనాలను ప్రసారం చేయడం ఆశ్చర్యానికి కలిగిస్తోంది. తెరవెనుక ఏదో జరిగిందని.. అందువల్లే వేమూరి రాధాకృష్ణ ఇలా వ్యవహరిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో.. వాటిని వైసీపీ సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేస్తోంది. “బాబు” కు మౌత్ పీస్ లాంటి ఛానల్లో ఇలాంటి కథనాలు వస్తున్నాయంటే.. ఏపీలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని వైసిపి సోషల్ మీడియా విభాగం వ్యాఖ్యానిస్తోంది. మరి దీనిపై టిడిపి శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. మరోవైపు ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్యే ల పై వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తోంది. వారంతా కూడా భూదందాలలో అడ్డగోలుగా సంపాదిస్తున్నారని, ఇసుక కుంభకోణాలలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని.. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తన కథనాలలో స్పష్టం చేస్తోంది.
Also Read: ABN RK And Chandrababu: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఏమైంది.. ఏబీఎన్ లో చంద్రబాబుకు వ్యతిరేక వార్తలా?