Rahul Gandhi Germany Visit : భారతదేశంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించాల్సిన రాహుల్ గాంధీ, ఆ బాధ్యతను పక్కన పెట్టి జర్మనీ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ పర్యటనలో ఆయన కలిసిన వ్యక్తులు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల నేపథ్యం అనేక అనుమానాలకు తావిస్తోంది.
రాహుల్ గాంధీ జర్మనీలో కలిసిన వారిలో ముఖ్యంగా కోర్నిలియా వాన్ (హెర్టీ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్) మరియు డాక్టర్ డేనియల్ వంటి వారు ఉన్నారు. వీరిపై వస్తున్న ప్రధాన ఆరోపణలున్నాయి..
వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలకు అంతర్జాతీయ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ నుంచి నిధులు అందుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జార్జ్ సోరోస్ గతంలో భారత ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై బాహాటంగానే విమర్శలు చేసిన వ్యక్తి. రాహుల్ కలిసిన కొందరు వ్యక్తులు భారత ప్రభుత్వం నిషేధించిన లేదా భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థలతో సంబంధం ఉన్నవారనే వాదన వినిపిస్తోంది. విదేశీ గడ్డపై ఉండి “భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది” అని రాహుల్ వ్యాఖ్యానించడంపై దేశీయంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
దేశంలో రాజకీయంగా ఒత్తిడి పెంచలేక, అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్ఠను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కేవలం విద్యావేత్తలను కలవడమే అయితే ఇంత వివాదం అయ్యేది కాదు, కానీ భారత్ పట్ల వ్యతిరేకత ఉన్న శక్తులతో చేతులు కలపడమే అసలు సమస్యగా మారుతోంది.
రాహుల్ గాంధీ జర్మనీ పర్యటన ఆంతర్యం తెలుసా ? దీనిపై ‘రామ్’ గారి సునిశత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.