Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు పొందిన ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాథ్..ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఘాట్స్ ఉన్న డైరెక్టర్ గా కూడా ఆయనకి పేరు తీసుకొచ్చి పెట్టాయి. ముఖ్యంగా చాలామంది దర్శకులు చాలా రోజులపాటు కష్టపడి మరి కథలను రాసుకుంటుంటే, పూరి మాత్రం పది రోజుల్లో కథను రాసేసి నెల రోజుల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాడు. అందువల్లే ఆయనకి ఇండస్ట్రీ లో ఎక్కువ క్రేజ్ ఉంటుంది.
ఇక స్టార్ హీరోలతో కూడా 60, 70 రోజుల్లో సినిమాలను తీసేసి ఇండస్ట్రీ హిట్ కొట్టగలిగే ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాధ్..అయితే ఈ మధ్య ఆయన హవా కొంచెం తగ్గినప్పటికీ, ఇప్పుడు రామ్ హీరోగా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా చాలా బిజీగా ఉన్న సమయంలో వచ్చిన డబ్బులను వచ్చినట్టు తన మేనేజర్ కి ఇచ్చి సేవింగ్స్ చేయమని చెప్పాడట..
దాంతో ఆయన సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి డబ్బుల గురించి అసలు పట్టించుకోలేదు. ఇక తన మేనేజర్ ఆయనకు 80 కోట్లు బొక్క పెట్టీ వాటిని ఎత్తుకొని వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే… ఇక ఆయన జేబులో అప్పుడు కనీసం ఒక రూపాయి కూడా లేదంట అయిన కూడా అలాంటి పరిస్థితుల్లో డిప్రెషన్ లోకి వెళ్లకుండా జీవితాన్ని చాలా సెటిల్డ్ గా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ధృడ సంకల్పంతో ముందుకు సాగాడు. ఇక అదే సమయంలో ఆయన భార్య లావణ్య గారు కూడా ఆయనకు మోరల్ గా చాలా సపోర్ట్ ఇచ్చి ఇప్పటిదాకా జరిగిందేదో జరిగింది. ఇక ఇప్పుడు మన లైఫ్ కొత్తగా స్టార్ట్ అయింది అనుకుందాం.
ఇప్పటినుంచి మన దగ్గర ఎంత ఉంటే అంతలో బతుకుదామని చెప్పిందట. ఆ ఒక్క మాటను పూరి జగన్నాథ్ కి చాలా కాన్ఫిడెంట్ ను ఇచ్చిందట…దాంతో మళ్లీ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ మీద వేట మొదలెట్టాడు. దాంతో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ వచ్చాడు…