https://oktelugu.com/

Pallavi Prashanth: బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఏ పార్టీలోకి అంటే?

కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు పల్లవి ప్రశాంత్. సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, గొడవల కారణంగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

Written By: , Updated On : March 26, 2024 / 02:19 PM IST
Pallavi Prashanth meet amberpet shankar

Pallavi Prashanth meet amberpet shankar

Follow us on

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. సదరు పోస్ట్ పల్లవి ప్రశాంత్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడని అనుమానాలు రేకెత్తించేదిగా ఉంది. ఇంతకీ ప్రశాంత్ షేర్ చేసిన ఫోటో ఏంటి? దాని వెనకున్న కథ ఏమిటో చూద్దాం..

కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు పల్లవి ప్రశాంత్. సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, గొడవల కారణంగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. తిరిగి యాక్టివ్ అయిన పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. వరుస వీడియోలు, రీల్స్ పోస్ట్ చేస్తున్నాడు.

ఈ మధ్య డ్రెస్సింగ్ నుంచి వాకింగ్ స్టైల్ వరకు అన్ని మార్చేశాడు. పలు సందర్భాల్లో రాజకీయాలపై పై ఆసక్తి ఉందని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. మీ సపోర్ట్ ఉంటే పొలిటికల్ లీడర్ అవుతానని వ్యాఖ్యానించాడు. నన్ను సీఎం ని చేయండి, రైతుల బాధలు తీరుస్తానంటూ పల్లవి ప్రశాంత్ చేసిన కామెంట్స్ విపరీతంగా ట్రోలింగ్ కు గురయ్యాయి.

ఈ నేపథ్యంలో తాజాగా పల్లవి ప్రశాంత్ పోస్ట్ ఒకటి చర్చనీయంగా మారింది. పల్లవి ప్రశాంత్ అంబర్ పేట్ శంకరన్న ఇంట్లో కనిపించాడు. ఆయనతో పలు విషయాలపై చర్చించాడు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో రైతు బిడ్డ పాలిటిక్స్ లోకి వస్తున్నాడనే వాదన మొదలైంది. ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడంటూ వస్తున్న వార్తలను బలపరిచేదిగా ఈ పరిణామం ఉంది.

అంబర్ పేట్ శంకర్ గతంలో బీజేపీలో ఉన్నాడు. ప్రస్తుతం బిఆర్ఎస్ లో ఉన్నట్లు సమాచారం. మరి అంబర్ పేట్ శంకర్ ని పల్లవి ప్రశాంత్ కలవడానికి అసలు కారణం ఏమిటనేది పల్లవి ప్రశాంత్ చెప్పాల్సి ఉంది. త్వరలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రశాంత్ రైతులకు సహాయం చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇటీవల ఓ పేద రైతు కుటుంబానికి లక్ష రూపాయల తో పాటు ఏడాదికి సరిపడా బియ్యం అందించాడు.