https://oktelugu.com/

Prabhu Deva: ప్రభుదేవా సంచలన నిర్ణయం..

నటుడు, దర్శకుడు ప్రభుదేవా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లుగా ప్రభుదేవాకి పెద్దగా సక్సెస్ లు రావడం లేదు. సల్మాన్ ఖాన్ తో చివరగా చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. ఇక పై డైరెక్షన్ చేయకూడదని నిర్ణయించున్న ఆయన నటన పైనే పూర్తి దృష్టి పెట్టాడని తెలుస్తోంది. నటుడిగా వరుస అవకాశాలు వస్తున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన భగీరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 21, 2021 / 10:37 AM IST
    Follow us on

    నటుడు, దర్శకుడు ప్రభుదేవా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లుగా ప్రభుదేవాకి పెద్దగా సక్సెస్ లు రావడం లేదు. సల్మాన్ ఖాన్ తో చివరగా చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. ఇక పై డైరెక్షన్ చేయకూడదని నిర్ణయించున్న ఆయన నటన పైనే పూర్తి దృష్టి పెట్టాడని తెలుస్తోంది.

    నటుడిగా వరుస అవకాశాలు వస్తున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన భగీరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదల కానుంది. కాగా, ప్రభుదేవా దర్శకుడిగా మారిన తర్వాత కొరియోగ్రాఫర్ గా ఒకరిద్దరు హీరోలకు మాత్రమే డాన్స్ కొరియోగ్రఫీ చేశారు.

    నడుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఇండియన్ మైకేల్ జాన్సన్ గా పేరొందారు. తెలుగులో ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు.