Milk Adulteration Test: దేశంలో పాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే దేశంలోని పలు ప్రాంతాల ప్రజలు కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురవుతున్నారు. పాలలో నీళ్లు కలుతారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది యూరియాతో పాలను తయారు చేస్తున్నారు. పిల్లలు యూరియాతో తయారు చేసిన పాలను తాగితే పిల్లల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. యూరియాతో తయారు చేసిన పాల వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
అయితే కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా పాలలో కల్తీ జరిగిందో లేదో సులభంగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఏటవాలుగా ఉండే ప్రాంతంపై పాలచుక్కను వేస్తే నీళ్లు కలిపిన పాలచుక్క వేగంగా జారుతూ కిందికి వస్తుంది. అలా కాకుండా స్వచ్చమైన పాలు అయితే మాత్రం నెమ్మదిగా కిందికి వస్తుంది. స్టార్చ్ లాడిన్ ద్రావణంలో పాలు వేసిన తర్వాత ఆ పాలు నీలం రంగులోకి మారితే పాలలో పిండి కలిపినట్లుగా భావించాలి.
పాలను నీటిలో కలిపిన సమయంలో నురుగు ఎక్కువగా వస్తే డిజర్జెంట్ పౌడర్ కలిపినట్లుగా భావించాలి. యూరియా స్ట్రిప్స్ తో పాలలో కృత్రిమ ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కల్తీ పాలు తాగడం వల్ల గుండె, కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కల్తీ పాలలోని సోడియం శరీరంపై ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. సింథటిక్ పాలను వేడి చేస్తే పాలు పసుపు రంగులోకి మారతాయి.
పాలను టెస్ట్ ట్యూబ్ లో వేసి కొంచెం పసుపు వేసి పాలకు ఎర్ర లిట్మస్ కాగితాన్ని జోడిస్తే కాగితం రంగు మారితే మాత్రం యూరియా కలిపారని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా పాలలో కల్తీ జరిగిందో లేదో చెక్ చేసుకుంటే మంచిది.