Bank Loan: మనలో చాలామంది వేర్వేరు కారణాల వల్ల వేర్వేరు సందర్భాల్లో రుణాలను తీసుకుంటూ ఉంటారు. అయితే రుణాల విషయంలో చేసే చిన్నచిన్న తప్పుల వల్ల ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తక్కువ రుణానికి ఎక్కువ విలువ గల ఆస్తులను పూచీగా పెట్టడం కూడా సరి కాదు. చాలామంది నివాస, వాణిజ్య ఆస్తులను పూచీకత్తుగా పెట్టి రుణాలను తీసుకుంటూ ఉంటారు.
ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టడం ద్వారా ఎడ్యుకేషన్ లోన్ తో పాటు బిజినెస్ అవసరాల కోసం, విద్య, గృహాల కొనుగోలు కోసం లోన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ రుణాలకు ఎక్కువ వడ్డీని చెల్లించాల్సిన అవసరం ఉండదు. సకాలంలో రుణం చెల్లించకపోతే మాత్రం బ్యాంకు తనఖా పెట్టిన ఆస్తిని వేలం వేసే అవకాశాలు అయితే ఉంటాయి. చెల్లించాల్సిన రుణం కంటే ఆస్తి విలువ ఎక్కువ అయితే లాయర్ లేదా ఆర్థిక సలహాదారు సలహాలు తీసుకోవచ్చు.
ఎండోమెంట్, మనీబ్యాక్ బీమా స్కీమ్స్ ద్వారా కూడా రుణాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. పాలసీ సరెండర్ విలువ ఆధారంగా రుణం లభిస్తుంది. సరెండర్ విలువ ఆధారంగా 80 నుంచి 90 శాతం వరకు రుణం లభించే అవకాశాలు ఉంటాయి. బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ల ద్వారా కూడా రుణాలను పొందే అవకాశం ఉంటుంది. ఒక్కరోజులోనే ఈ రుణాలు లభిస్తాయి.
మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీ షేర్లు బాండ్ల ద్వారా కూడా రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీటి ద్వారా నగదు లభ్యత తక్కువగా ఉంటుంది. జాతీయ పొదుపు పత్రాల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్ విలువలో 85 నుంచి 90 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.