
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించడానికి మరింత గడువు కావాలని సీబీఐ అధికారులు కోరారు. సీబీఐ తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అనారోగ్యం కారణంగా కౌంటర్ దాఖలు చేయలేక పోయామని తెలిపారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా పడింది.