డెల్టా డేంజర్: వెయ్యి రెట్లు ఎక్కువ వ్యాపిస్తోందట

కరోనా ప్రభావం పెరుగుతోంది. మొదటి, రెండో దశల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ప్రజల ప్రాణాలు బలి తీసుకుంది. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా వైరస్ ధాటికి తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనాలో కొత్తగా వేరియంట్ల ప్రభావం చూపుతున్నాయి. ఇందులో డెల్టా వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ వేరియంట్ ను కట్టడి చేయడానికి ముమ్మర చర్యలు అవసరమని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ -19 టీకాలు అందరికి అందుబాటు లేకపోవడంతో డెల్టా వేరియంట్ ఉధృతికి […]

Written By: Srinivas, Updated On : July 26, 2021 11:38 am
Follow us on

కరోనా ప్రభావం పెరుగుతోంది. మొదటి, రెండో దశల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ప్రజల ప్రాణాలు బలి తీసుకుంది. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా వైరస్ ధాటికి తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనాలో కొత్తగా వేరియంట్ల ప్రభావం చూపుతున్నాయి. ఇందులో డెల్టా వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ వేరియంట్ ను కట్టడి చేయడానికి ముమ్మర చర్యలు అవసరమని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ -19 టీకాలు అందరికి అందుబాటు లేకపోవడంతో డెల్టా వేరియంట్ ఉధృతికి కళ్లెం వేయాలని భావిస్తున్నారు.

2019లో చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా ప్రపంచ దేశాల్లో వ్యాపించి అందరిని ఇబ్బందులకు గురిచేసింది. గతేడాది మార్చిలో అత్యంత సామర్థ్యం కలిగిన డి614జి రకం వెలుగు చూసింది. బ్రిటన్ లో అల్ఫా రకం బయటపడింది. 2021 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా దీని వ్యాప్తి పెరిగింది. ఈ లోగా డెల్టా వేరియంట్ మొదలైంది. దీంతో మనిషిలోని రోగనిరోధక శక్తి తగ్గి డెల్టా వేరియంట్ సోకిన వ్యక్తి నుంచి వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్ వెలువడుతున్నట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గరకు వెళ్లినప్పటి నుంచి ఇన్ ఫెక్షన్ బారిన పడటానికి మధ్య సరాసరి ఆరురోజుల వ్యవధి ఉండేది. డెల్టా వేరియంట్ విషయంలో ఇది నాలుగు రోజులకు పడిపోయింది. దీంతో ఇన్ ఫెక్షన్ సోకడానికి ముందే వారిని గుర్తించడం కష్టమవుతోంది. బాధితుడికి దగ్గరగా వెళ్లిన వ్యక్తి నుంచి 24 గంటల్లోనే వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలుస్తోంది.

కరోనా కట్టడికి నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. 60 శాతానికి పైగా జనాభా టీకా పొందిన ఇజ్రాయెల్ వంటి దేశాల్లో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్నప్పటికి ఆస్పత్రి పాలు,మరణం ముప్పు నుంచి చాలా వరకు రక్షణ పొందినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నివారణ చర్యలు చేపట్టి డెల్టా వేరియంట్ నిర్మూలనకు ఉపక్రమించడం ఒకటే మన ముందు ఉన్న పరిష్కారమని గుర్తించుకోవాలి.