
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. గట్టిగా మరో సంవత్సరం పాటు పాలనను కొనసాగించి.. ఆ తరువాత ఎన్నికల బరిలో దిగనుంది. ఇప్పటికీ రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ నాయకులు హ్యాట్రిక్ సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహం పన్నుతున్నారు. తాజాగా లోక్ సభ సీట్ల పెంపు ప్రయత్నాన్ని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చి ఎన్డీఏ పై ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నాయి.
ప్రస్తుతం లోక్ సభలో 543 మరో రెండు సీట్లున్నాయి. వీటిని 1000 పెంచేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2019లోనే అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లోక్ సభ సీట్ల పెంపు ప్రతిపాదనను తీసుకొచ్చారు. దానిని బేస్ చేసుకొని ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందే దీనిని పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. బ్రిటన్లో 643, అమెరికాలో 535 పార్లమెంట్ సభ్యులున్నప్పుడు అధిక జనాభా కలిగిన భారతదేశంలో 1000 ఉంటే తప్పేంటన్న అభిప్రాయానిక వచ్చారు.
లోక్ సభ సీట్ల పెంపు వలన అధికారా పార్టీకి లాభమా..? అన్న చర్చ సాగుతోంది. 2024 వరకు బీజేపీ పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికీ కమంలపై కొంత వ్యతిరేకత వస్తోంది. ఇది ప్రతిపక్షాలకు అస్త్రం కాకుండా ఈలోపు ఈ ప్రక్రియ కనుక పూర్తయితే లాభిస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాజకీయంగా కొత్త ప్రణాళికలు చేపట్టినట్లు సమాచారం. ఈమేరకు కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ తమకు సమాచారం అందిందిని తెలిపారు.
లోక్ సభ సీట్లు పెంచితే తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు అనుకూల వాతావరణమే అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి 9 , వైసీపీ నుంచి 23 మంది లోక్ సభ సభ్యులున్నారు. సీట్లు పెరిగితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్లమెంట్లో కింగ్ మేకర్లు కానున్నారు. మరోవైపు దక్షిణాదిలోని డీఎంకే పార్టీ కూడా తమ పార్టీ ఎంపీలు పెరిగితే మూడో కూటమి ఏర్పాటుకు కీలకంగా మారే అవకాశం ఉంది. దీంతో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ పార్టీలను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.