spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pithapuram constituency : ఇక పవన్ కు పిఠాపురం శాశ్వతం!

Pithapuram constituency : ఇక పవన్ కు పిఠాపురం శాశ్వతం!

Pithapuram constituency :  ఏపీలో చాలామంది కూటమి నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.. అయితే వివిధ సమీకరణలో భాగంగా వారికి ఛాన్స్ దక్కలేదు. ప్రధానంగా పిఠాపురం వర్మ గత రెండేళ్లుగా పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును కూడా త్యాగం చేశారు వర్మ. కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అందుకే వర్మ సైతం మెత్తబడి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. పవన్ గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఇంతవరకు వర్మకు ఛాన్స్ ఇవ్వలేదు. నామినేటెడ్ పదవి లభించలేదు. అయితే దీనికి కారణం పవన్ కళ్యాణ్ అన్న ఆరోపణ ఉంది. అందుకు తగ్గట్టుగానే పిఠాపురం జనసేనతో వర్మకు చాలా సార్లు విభేదాలు వచ్చాయి. అయితే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడానికి పవన్ కారణం అన్నది ఒక వాదన. అయితే ఇప్పుడు నియోజకవర్గాల పెంపుతో వర్మ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

* మంచి పట్టున్న నేత..
పిఠాపురం నుంచి గతంలో ఇండిపెండెంట్ గా గెలిచారు వర్మ. తెలుగుదేశం పార్టీ టికెట్ లభించకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి తిరిగి టిడిపిలో చేరారు. 2019లో మాత్రం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసిపి హయాంలో ఐదేళ్లపాటు పిఠాపురం నియోజకవర్గాన్ని టిడిపికి అనుకూలంగా మార్చారు. అయితే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఆ సీటును కోరుకున్నారు. దీంతో చంద్రబాబు ఒత్తిడి మేరకు పిఠాపురం నియోజకవర్గాన్ని వర్మ వదులుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ పదవి హామీతో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు వర్మ. కానీ వర్మకు ఇచ్చిన హామీ మాత్రం ఇంతవరకు నెరవేరలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు కూడా ఆ మధ్యన ప్రచారం నడిచింది.

* కొత్త నియోజకవర్గ బాధ్యతలు
వర్మ కు నామినేటెడ్ పదవి దక్కకపోవడం వెనుక ఒక కారణం ఉన్నట్లు ప్రచారం నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో ఉండరు. అందుకే సమన్వయానికి ఓ ఐదుగురుతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఇటువంటి సమయంలో వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మారుతారు. గతంలో నుంచి పట్టు ఉండడంతో అధికారులతో పాటు ప్రజలు ఆయన వైపు వెళ్తారు. అది పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది కరం. అందుకే ఎమ్మెల్సీ తో పాటు నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు వెనుకడుగు వేశారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సిద్ధం అయ్యింది. ఈ పరిస్థితుల్లో పిఠాపురం బదులు కొత్త నియోజకవర్గం ఏర్పడితే వర్మకు అక్కడి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పిఠాపురం పవన్ కళ్యాణ్ కు శాశ్వత నియోజకవర్గం కానుంది. అందుకే ఇప్పుడు వర్మకు లైన్ క్లియర్ అయినట్టు అవుతుంది. అదే సమయంలో ఎమ్మెల్సీ లాంటి నామినేటెడ్ పదవి దక్కి చాన్స్ కూడా కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper
Exit mobile version