Peddi ticket rates reduced : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఏమాత్రం తగ్గలేదు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 10 రోజుల్లో దాదాపుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ స్థాయి డ్రీం లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటున్న ఈ సినిమాకు ఓవర్సీస్ మరియు నార్త్ ఇండియా మార్కెట్ కలిసొచ్చి ఉండుంటే 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అవలీలగా నమోదు అయ్యి ఉండేది. కానీ ఆ ప్రాంతాల్లో ఈ చిత్రం డిజాస్టర్ గా నిల్చింది. మొదటి రోజే వస్తాయని భావించిన వసూళ్లు , 10 రోజులు దాటినా రాలేదు. ఇదొక్కటే మెగా ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేస్తున్న విషయం. అయితే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో 176 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 296 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 220 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , వంద కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు రావాలి. కానీ అంతటి లాంగ్ రన్ వస్తుందా లేదా అనే అనుమానం బయ్యర్స్ తో పాటు నిర్మాతల్లో కూడా ఉంది. అందుకే 11 రోజుల వరకు టిక్కెట్ రేట్స్ పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతించిన, కేవలం 10 రోజులకు మాత్రమే చాలు అని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. 11 వ రోజు నుండి , అనగా , రేపటి నుండి మామూలు రేట్స్ తోనే పెద్ది చిత్రాన్ని చూడొచ్చు. తగ్గినా టిక్కెట్ రేట్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బాగా పెరుగుతారని , అంతే కాకుండా, రిపీట్స్ లో ఈ చిత్రాన్ని చూడాలని అనుకున్న ఆడియన్స్ కూడా పెరుగుతారని నిర్మాతలు స్ట్రాటజీ వేశారు.
మరి ఈ స్ట్రాటజీ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. నేటి అడ్వాన్స్ బుకింగ్స్ , కరెంట్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి , కానీ రేపు వేరే లెవెల్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. పరిస్థితి చూస్తుంటే రెండవ రోజు తర్వాత ‘పెద్ది’ చిత్రానికి రేపు ది బెస్ట్ గా నిలిచే అవకాశం ఉందని , కొత్త సినిమాల తాకిడి కూడా పెద్దగా లేకపోవడం వల్ల, ఈ సినిమాకు రేపు తెలుగు రాష్ట్రాల నుండి 6 నుండి 7 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

