Happy re release Kerala : అల్లు అర్జున్ కి కేరళ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందరూ ఆయన్ని ‘మల్లు అర్జున్’ అని పిలుస్తుంటారు. యూత్ ఆడియన్స్ లో ఆ స్థాయి క్రేజ్ ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ అతను. అల్లు అర్జున్ కి కేరళ లో ఇలాంటి క్రేజ్ కి పునాది వేసిన చిత్రం ‘హ్యాపీ’. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘హ్యాపీ’ చిత్రం మన తెలుగు లో ఫ్లాప్ అయ్యింది. కానీ కొన్నాళ్ళకు ఇదే చిత్రాన్ని మలయాళం లో డబ్ చేసి కేరళలో విడుదల చేయగా , అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. మమ్మూటీ , మోహన్ లాల్ వంటి కేరళ సూపర్ స్టార్స్ తో సమానంగా ఈ చిత్రం ఆరోజుల్లో అత్యధిక సెంటర్స్ లో 100 రోజులు ఆడడం గమనార్హం.
ఆ చిత్రాన్ని ఇప్పుడు 4K కి మార్చి , డాళ్బీ అట్మాస్ సౌండ్ తో నిన్న గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. ఎంతలా అంటే , ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన మన స్టార్ హీరోల కొత్త చిత్రాలు ‘రాజా సాబ్’, ‘పెద్ది’ వంటి వాటికంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు అన్నమాట. కేరళ ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజున 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి అట. ‘పెద్ది’ చిత్రానికి మొదటి రోజు 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రాజా సాబ్ చిత్రానికి 19 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అంతే కాదు, ఈ చిత్రం గత ఏడాది భారీ లెవెల్ లో రీ రిలీజ్ అయినటువంటి ‘బాహుబలి ది ఎపిక్’ మొదటి రోజు వసూళ్లను కూడా కేరళలో దాటింది. ‘బాహుబలి ది ఎపిక్’ చిత్రానికి 26 లక్షల రూపాయిల గ్రాస్ మాత్రమే మొదటి రోజు వచ్చింది.
అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డుని కూడా నెలకొల్పాడు. కేరళలో ఇప్పటి వరకు మోహన్ లాల్ మాత్రమే రీ రిలీజ్ లో 30 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాడు. మరో మలయాళం హీరో ఆయన దరిదాపుల్లో లేరు. అలాంటిది అల్లు అర్జున్ ఆయన తర్వాత స్థానం లో నిలవడం అనేది సాధారమైనది కాదు. ఇతర రాష్ట్రాల్లో మన టాలీవుడ్ నుండి రాజమౌళి తర్వాత , అంతటి బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న ఏకైక నటుడు అల్లు అర్జున్ అని ట్రేడ్ అంటూ ఉంటుంది. అలా ఎందుకు అంటుందో , ఈ ‘హ్యాపీ’ రీ రిలీజ్ ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.

