Homeఎంటర్టైన్మెంట్Peddi 25 Days Collections: 'పెద్ది' 25 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇక కేవలం...

Peddi 25 Days Collections: ‘పెద్ది’ 25 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇక కేవలం 2 కోట్లు మాత్రమే తక్కువ..

Peddi 25 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై 25 రోజులు పూర్తి అయ్యింది. చాలా మంది ఈ చిత్రానికి మొదట్లో వచ్చిన డివైడ్ టాక్ ని చూసి , వీకెండ్ తర్వాత బాగా డౌన్ అయిపోతుందని అనుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో 25 రోజున కూడా ఈ చిత్రానికి అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ బోర్డ్స్ పడ్డాయి. ఒక స్టార్ హీరో సినిమాకు ఈ రేంజ్ లాంగ్ రన్ ఉండడం సాధారణమైన విషయం కాదు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్క ప్రకారం ఈ సినిమాకు 25 వ రోజున 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ప్రతిష్టాత్మక 150 కోట్ల షేర్ మార్కుని అందుకోగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 348 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంది. ప్రాంతాల వారీగా ఈ సినిమాకు ఎంత వసూళ్లు వచ్చాయి అనేది వివరంగా చూద్దాం.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి 25 రోజుల్లో 54 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. నైజాం బయ్యర్స్ బ్రేక్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టారు కానీ , భారీ లాభాలను మాత్రం చూడలేకపోయారు. ఇక సీడెడ్ ప్రాంతం లో అయితే 25 రోజులకు కలిపి 21 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఉత్తరాంధ్ర నుండి 23 కోట్ల 6 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 13 కోట్లు , వెస్ట్ గోదావరి నుండి 9 కోట్ల 17 లక్షలు , గుంటూరు నుండి 12 కోట్ల 68 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 10 కోట్ల 30 లక్షలు , నెల్లూరు నుండి 5 కోట్ల 91 లక్షలు వచ్చాయి.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ , నెల్లూరు లో తప్ప, అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయ్యి భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. మరోవైపు రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ ప్రాంతాల్లో భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కర్ణాటక నుండి 15 కోట్ల 30 లక్షలు , ఓవర్సీస్ నుండి 23 కోట్ల 75 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 15 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 203 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు , 348 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి .

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version