
ఉస్మానియా యూనివర్సిటీలో కొత్త రికార్డు నెలకొంది. డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలకు ఊహించని విధంగ విద్యార్థులు హాజరయ్యారు. కరోనా విజృంభన తరువాత ప్రభుత్వం ఓ దశలో అందరూ విద్యార్థులు పాసయ్యారని ప్రకటించింది. అయితే కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఓయూలో తొలిరోజు జరిగిన బీఏ, బీకాం, బీఎస్సీ గ్రూపులకు నిర్వహించిన చివరి సెమిస్టర్ పరీఓలకు 97. 05 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఓయూ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు హాజరుకావడం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు.
Also Read: ఇళ్లు, భూమి, ఫ్లాట్.. ప్రతీ లెక్క ఆన్‌లైన్‌లోకి..