OnePlus 13 Price Drop : మార్కెట్లో ఎన్నో రకాల మొబైల్స్ అందుబాటులోకి వచ్చినా.. కొన్ని కంపెనీలకు క్రేజ్ తగ్గగానే చెప్పాలి. వీటిలో One Plus మొబైల్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కంపెనీ నుంచి విభిన్న మోడల్స్ ఇప్పటికే వినియోగదారుల వద్దకు చేరి ఆకట్టుకుంటున్నాయి. అయితే కొన్నింటి ధర అధికంగా ఉండడంతో వాటిని కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేశారు. ముఖ్యంగా యూత్ కు ఈ రకమైన మొబైల్ బాగా నచ్చిన కూడా.. వాటిని కొనుగోలు చేయలేదు. దీంతో ఆ కంపెనీ ఓ మోడల్ పై భారీగా ప్రైస్ తగ్గించింది. అద్భుతమైన ఫీచర్స్ ఉండడంతోపాటు.. అత్యధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉన్న ఈ మొబైల్ పై భారీ స్థాయిలో తగ్గింపును ప్రకటించింది. ఇంతకీ ఆ మొబైల్ ఏదో ఇప్పుడు చూద్దాం..
One plus 13 మొబైల్ ఇప్పటికే క్రేజీ ని సంపాదించుకుంది. కానీ దీని ధర అధికంగా ఉండటంతో కొంతమంది వెనుకడుగు వేశారు. అయితే భారతదేశంలో ఇప్పుడు దీని ధరను తగ్గించారు. దీనిపై ఏకంగా ఫ్లాట్ గా రూ.6,000ను తగ్గించారు. అలాగే బ్యాంకు ఖాతాల ద్వారా కొనుగోలు చేస్తే రూ.4,000 కు తగ్గుతుంది. ఇప్పటివరకు దీనిని ఆమెజాన్
లో రూ.69,999 ధరతో విక్రయించేవారు.. ఇప్పుడు తగ్గింపు ధరతో రూ.63,999కు కొనుగోలు చేయొచ్చు. అయితే ఆక్సిస్ బ్యాంకు కార్డు, హెచ్డిఎఫ్సి కార్డు ఉన్నవారు మరో రూ.4,000 డిస్కౌంట్ పొందవచ్చు.
వన్ ప్లస్ 13 ఫీచర్స్ చాలా వరకు ఆకట్టుకుంటాయి. ఇందులో బ్యాటరీ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.6000mAh ఫ్యాటరీతోపాటు 8 ఎలైట్ చిప్సెట్ ను కలిగి ఉంది. దీంతో దాదాపు ఒక రోజు మొత్తం చార్జింగ్ దిగకుండా ఉంటుంది. ప్రతి మొబైల్ లో చాలామంది కోరుకునేది కెమెరా పనితీరు. అది ఈ మొబైల్లో అద్భుతంగా ఉందని అనుకోవచ్చు. ఇందులో 12 నుంచి 50 మెగాపిక్చల్ LYT 808 ప్రధాన కెమెరాను అమర్చారు. ఇది అల్ట్రా వైడ్ సెన్సార్ తో అద్భుతమైన ఫోటోలను తీయగలదు. పాత మొబైల్ కంటే ఈ కొత్త వెర్షన్ వాటర్ ప్రూఫ్ గా పనిచేయనుంది. అంటే IP 68, IP 69 రిప్రెషన్ రేట్ ను కలిగి ఉండడంతో ఎలాంటి హార్డ్వేర్ సమస్యల నుంచైనా తట్టుకునే అవకాశం ఉంది. ఈ యొక్క బెటర్ తోనే చాలావరకు ఈ మొబైల్స్ విక్రయాలు జరుపుకుంటున్నాయని అంటున్నారు. ఇందులో బయోమెట్రిక్ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు. ఇది తడి చేతులతో ఫోను లాక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఈ మొబైల్ లో 6.82 అంగుళాల Hz QHD+డిస్ప్లేను కలిగి ఉంది. దీంతో వీడియోలు, గేమింగ్ కోసం అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తుంది. దీని డిజైన్ కూడా లెదర్ బ్యాక్ ప్యానెల్తో కలిగి ఉంది. దీంతో ఈ మొబైల్ చేతిలో మంచి గ్రిప్ ను సాధిస్తుంది. ఇలా అన్ని రకాలుగా యువతకు బాగా నచ్చే ఫీచర్స్ ఉండడంతో దీని కొనుగోలుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.