Odisha tribal man bank incident : ఇటీవల తన సోదరి బ్యాంకులో ఉన్న డబ్బుల కోసం గిరిజనుడు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. బ్యాంకు అధికారులు రకరకాల షరతులు విధించడం.. అనేక రకాల నిబంధనలు విధించడంతో.. జీతూ ముండా అనే గిరిజనుడు తన అక్క సమాధిని తవ్వాడు. ఆమె ఆస్తిపంజరాన్ని బయటకి తీసి.. బ్యాంకు కార్యాలయానికి తీసుకెళ్లాడు. ఈ సంఘటన ఒడిశాలో జరిగింది. యావత్ దేశాన్ని మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసింది.
సామాన్యులను నిబంధనల పేరుతో బ్యాంక్ అధికారులు ఎలా విసిగిస్తారో ఈ సంఘటన నిరూపించింది. నిబంధనల పేరుతో బ్యాంక్ అధికారులు పెట్ట ఇబ్బందులు సామాన్యులకు నరకం చూపిస్తాయి. అనేక సందర్భాలలో వారు అడిగే ఆధారాలు సమకూర్చడం సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తాయి.. ఈ సంఘటన తర్వాత బ్యాంక్ అధికారులు.. అక్కడి ప్రభుత్వం.. బాధిత గిరిజనుడు ఏం చేశాడు.. ఇవన్నీ కూడా వెలుగులోకి రాలేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇవన్నీ బయటికి వస్తున్నాయి.
ఆ గిరిజనుడు తన సోదరి అస్తిపంజరంతో బ్యాంకుకు వెళ్ళాడు. బ్యాంక్ అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. బ్యాంకు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడంతో.. మృతురాలి ఖాతాలో ఉన్న డబ్బు.. దానిపై వడ్డీ మొత్తం కలిపి 19,042 రూపాయలను చెల్లించారు. ఆ డబ్బులను ఆ గిరిజన కుటుంబం మూడు భాగాలుగా పంచుకున్నది..
“మా సోదరితో అద్భుతమైన అనుబంధం ఉంది. ఆమె నా ఇంట్లోనే వశించేది. ఆమె తీవ్రస్థాయిలో అనారోగ్యానికి గురైనప్పుడు అన్ని సపర్యలు చేసేవాడిని. ఆమె చనిపోవడం నాకు జీవితకాలం లోటు. నేను చేసిన పనిని చాలామంది తప్పు పడుతున్నారు. కానీ నాకు అంతకుమించిన మార్గం ఇంకొకటి కనిపించలేదు. మా సంప్రదాయం ప్రకారం మా అక్క అంత్యక్రియలను మరొకసారి నిర్వహిస్తాను.. నేను నా సోదరి ఆస్తిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లిన తర్వాత స్థానిక ప్రజల నుంచి 15 లక్షల వరకు ఆర్థిక సాయం లభించింది. ఒకవేళ నేను ఆ పని చేయకపోతే నాకు డబ్బు వచ్చేది కాదు. చుట్టుపక్కల వారు సహాయం చేసేవారు కాదు. మా సమస్య పరిష్కారమైంది.. అందరికీ ధన్యవాదాలు” అని ఆ గిరిజనుడు పేర్కొన్నాడు…
బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని అతడిని కోరుతున్నాడు. నా సమస్యను వారు పరిష్కరించిన తర్వాత ఇంకా చర్యలు ఎందుకు అంటూ అతడు ప్రశ్నిస్తున్నాడు.. గ్రామస్తులకు మే నెల ఆరవ తేదీన భోజనాలు పెడతామని.. బ్యాంకు అధికారులను కూడా ఆహ్వానిస్తామని.. అతడు పేర్కొన్నాడు. మృతురాలి సోదరుడు పెద్ద మనసుతో బ్యాంకు అధికారులను క్షమించినప్పటికీ ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. వారి మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తుంది.