Dhanush next movie story: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నటుడు ధనుష్… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ధనుష్ ఇప్పుడు సరికొత్త కథలతో సినిమాలు చేస్తే బాగుంటుందని అతని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఎప్పుడు ఆయన విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలను ఎంచుకొని ఎమోషనల్ గా ప్రేక్షకులకు బాగా దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. ఇక ఎప్పుడు అలాంటి రొటీన్ సినిమాలనే కాకుండా జేమ్స్ బాండ్ తరహా సినిమాలను చేస్తే చూడాలని కూడా అతని అభిమానులైతే కోరుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ధనుష్ తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. గత సంవత్సరం తెలుగులో చేసిన ‘కుబేర’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఈ సంవత్సరం రీసెట్ గా చేసిన కర సినిమాతో పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నాడు.
ఫ్యూచర్లో రాబోతున్న సినిమాలతో కూడా ఆయన డిఫరెంట్ సబ్జెక్టులనైతే ఎంచుకొని సినిమాలుగా చేస్తున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా ధనుష్ లాంటి నటుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా వాళ్ళు చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం అతనికి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ క్రియేట్ అయింది.
ఏ ఇండస్ట్రీలో ఆయన ఒక డిఫరెంట్ కథ రాసుకున్న ప్రతి దర్శకుడు మొదట ధనుష్ నే అప్రోచ్ అవుతుంటారు. ఎందుకంటే డిఫరెంట్ సినిమాలను తను మాత్రమే చేస్తాడు. అందువల్లే ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు… ఫ్యూచర్లో ధనుష్ ఇంకా మూవీస్ చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గర అవ్వాలని కోరుకుందాం…
తెలుగు దర్శకులు సైతం అతనితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయన తెలుగులో సార్, కుబేర లాంటి వరుస సినిమాలను చేసి సక్సెస్ లను సాధించాడు. కాబట్టి ఇకమీదట కూడా మంచి కథలు దొరికితే తెలుగు సినిమాలను చేయడానికి సైతం ఆయన ఆసక్తిగా ఉన్నాడట…