Slum Dog movie release date update: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్… గతంలో చేసిన చాలా సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ప్రస్తుతం ఆయన నుంచి వచ్చే సినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. రీసెంట్ గా ఆయన చేసిన ‘లైగర్’ సినిమా పాన్ ఇండియాలో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాయి. దాంతో దర్శకుడిగా పూరి జగన్నాథ్ చాలా వరకు వెనుకబడిపోయాడు. రామ్ తో చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కూడా ప్రేక్షకుల్లో నిరాశను మిగిల్చింది. దాంతో పూరి జగన్నాథ్ పని అయిపోయిందని అందరు అనుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ సేతుపతిని మెయిన్ లీడ్ లో పెట్టి ‘స్లమ్ డాగ్ ‘ అనే సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా పరిస్థితి ఏంటి? ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కొనుగోలు చేయడం లేదా? సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. గతంలో పూరి జగన్నాథ్ లైగర్ సినిమాకు సంబంధించిన విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేదట.
డబ్బులను రిటర్న్ చేస్తానని చెప్పి తను చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాడని అందువల్లే తన సినిమాని రిలీజ్ చేయడానికి వీలు లేదంటూ వాళ్ళు రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలైత్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. థియేటర్లోకి వస్తుందా? లేదంటే ఓటిటి లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతుందా? అనే విషయాల మీద సరైన క్లారిటి రావాల్సి ఉంది…
మొత్తానికైతే పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తేనే మరోసారి తను టాప్ లెవల్ కి వెళ్ళాడు. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డీలాపడిపోతాడనే చెప్పాలి… తనను తాను మరోసారి స్టార్ట్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…