
అభిమానులకు ఎన్టీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు ఏ విధమైన వేడుకలు చేయవద్దని సూచించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వేడుకలకు ఇది సరైన సమయం కాదని ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నియమాలు పాటించాలని కోరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని త్వరలోనే కరోనా నుంచి పూర్తిగా కోటుకుంటానని పేర్కొన్నారు.