Homeఎంటర్టైన్మెంట్ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఫ్యాన్స్ కు చేతనవుతుందా ?

ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఫ్యాన్స్ కు చేతనవుతుందా ?

NTRరేపు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఎన్టీఆర్ అభిమానులకు రేపు పెద్ద పండగతో సమానం. ఫ్యాన్స్ చేసే సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ, వారి ఉత్సవాలు ఒక్కోసారి అతిగా అనిపిస్తాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులు వేడుకల పేరిట ఎక్కడ అతిగా ప్రవర్తిస్తారో ఎన్టీఆర్ ముందుగానే వారికి సోషల్ మీడియా వేదికగా ఒక విజ్ఞప్తి చేశారు.

ఎన్టీఆర్ ఒక లెటర్ రాస్తూ…”గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తిగా కోలుకుని కోవిడ్‌ను జయిస్తాను. ప్రతి ఏటా మీరు నా పుట్టినరోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను.

కానీ ఈ సంవత్సరం మాత్రం మీరు ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే నాకు మీరందించే అతి పెద్ద కానుక. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు మన సంఘీభావం తెలపాలి. ఆత్మీయులను కోల్పోయిన వారికి అండగా నిలబడాలి.

మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీరూ జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మన దేశం ఈ కరోనాను జయిస్తుంది అని నమ్ముతున్నా. ఆ రోజు అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటివరకు మాస్క్ ధరించండి, జాగ్రత్తగా ఉండండి.’ అంటూ ఎన్టీఆర్‌ ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. మరి ఈ కరోనా కాలంలో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కి దూరంగా ఉండటం అభిమానులకు చేతనవుతుందా ? తారక్ కి కరోనా అని తెలియగానే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పూజల పేరిట హంగామా చేశారు. మరి బర్త్ డే ఏమి చేస్తారో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular