Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ఆయుష్మాన్ భారత్: సీఎం పై విజయశాంతి సెటైర్లు

ఆయుష్మాన్ భారత్: సీఎం పై విజయశాంతి సెటైర్లు

సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ విజయశాంతి వ్యంగ్యాస్త్రం సంధించారు. ముఖ్యంత్రికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించిన ఆ దైవానికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ లపై బీజేపీ డిమాండ్కు కేసీఆర్ దిగొచ్చారన్నారు. గత 15 నెలల నుంచి కరోనాతో బాధపడి దవాఖానా బిల్లులు చెల్లించిన అందరికీ ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రీఎంబర్స్ మెంట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సుమారు 5 లక్షల పైన డోసుల నిల్వ లెక్కకు సరి తేలాలి లేదంటే ఇది టీఆర్ ఎస్ బ్లాక్ మార్కెట్ కుంభకోణం అని అనుకోవాల్సి వస్తుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular