NTR: ఎన్టీయార్ తో ఆ బాలీవుడ్ డైరెక్టర్ సినిమా…ఎప్పుడు పట్టాలెక్కుతుందంటే..?

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మీద అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

Written By: Gopi, Updated On : March 26, 2024 5:48 pm

NTR next film with Rajkumar Hirani

Follow us on

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఎన్టీఆర్ రేంజ్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాకు సంబంధించిన షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ను తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మీద అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి వాటన్నింటినీ తట్టుకొని ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజ్ కుమార్ హిరాని రీసెంట్ గా డంకీ అనే సినిమాతో ఒక భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు. ఇక ఈ సినిమా షారుఖ్ ఖాన్ కెరియర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది అని అందరు అనుకున్నారు.కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఈ సినిమా భారీ డిజాస్టర్ అవడం అనేది చాలామందిని నిరాశ పరిచింది.

ఇక ఇప్పుడు రాజ్ కుమార్ హిరానీ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక డంకీ సినిమా రిలీజ్ కి ముందే తను ఎన్టీఆర్ కు ఒక లైన్ చెప్పారంట. అది విపరీతంగా నచ్చిన ఎన్టీఆర్ మనం సినిమా చేద్దామని రాజ్ కుమార్ తో చెప్పినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఆ డైరెక్టర్ అదే స్టోరీ తో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయి అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక బాలీవుడ్ మీడియా మాత్రం ఎన్టీఆర్ రాజ్ కుమార్ హిరానీ తో సినిమా చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలనైతే ప్రసారం చేస్తుంది. మరి ఎన్టీఆర్ రాజ్ కుమార్ హిరానీ తో సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాలంటే దేవర సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…