Loksabha Elections 2024: లోక్ సభ స్థానాలకు బీజేపీ నుంచి పోటీ సినీ సెలబ్రెటీలు వీరే..

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఎవరు అంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు కంగనా రనౌత్. ఈమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నుంచి పోటీ చేయనుంది. ఇక్కడే ఆమె పుట్టి పెరిగింది. అయితే తొలిసారి ఎన్నికల బరిలో దిగనుంది ఈ హీరోయిన్. డ్రీమ్ గల్ గా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించి హేమ మాలిని.

Written By: Swathi, Updated On : March 26, 2024 5:56 pm

Loksabha Elections 2024

Follow us on

Loksabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న సమరం మొదలుకానుంది. జూన్ 7 వరకు ఏడు దశల్లో 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా 398 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మిగిలిన 145 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది. ఇప్పటి వరకు బీజేపీ ప్రకటించిన అభ్యర్థులలో కొందరు సినీ నేపథ్యం ఉన్నవారు కూడా ఉన్నారు. మరి వారెవరో ఓ సారి తెలుసుకోండి.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఎవరు అంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు కంగనా రనౌత్. ఈమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నుంచి పోటీ చేయనుంది. ఇక్కడే ఆమె పుట్టి పెరిగింది. అయితే తొలిసారి ఎన్నికల బరిలో దిగనుంది ఈ హీరోయిన్. డ్రీమ్ గల్ గా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించి హేమ మాలిని. ఈమె ఈ సారి కూడా మథురనుంచి పోటీ చేయనుంది. అయితే హేమ మాలిని 2014 నుంచి మథుర ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాధిక శరత్ కుమార్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమే.

ఈమె కూడా తమిళనాడులోని విరుధ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనుంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్ లోని అమేథీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధమైంది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి సీటును కైవసం చేసుంది. లాకెట్ ఛటర్జీ మరోసారి బీజేపీ అభ్యర్థిగా బెంగాల్ లోని హుగ్లీ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగనుంది. 2019లో ఇక్కడ నుంచే పోటీ చేసింది. ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లోక్ సభ స్థానం నుంచి రవికిషన్ మరోసారి బీజేపీ తరపున పోటీకి దిగనున్నారు.

రామాయణం సీరియల్ లో రాముడి పాత్రలో మెప్పించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అరుణ్ గోవిల్ కూడా బీజేపీ టికెట్ ను పొందారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచి ఈయన పోటీ చేయనున్నారు. మాజీ రాజ్యసభ ఎంపీ సురేష్ గోపి కేరళలోని త్రిసూర్ లోక్ సభ నుంచి పోటీకి దిగనున్నారు. భోజ్ పురి హీరో దినేష్ లాల్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ లోక్ సభ స్థానానికి పవన్ సింగ్ ను ఎంపిక చేసింది బీజేపీ. ఈ నటులు అందరూ బీజేపీ తరుపున పోటీకి దిగనున్నారు. మరి ఈ సారి గెలుపు ఎవరిదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.