Junior NTR : నందమూరి ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ను సంపాదించుకొని, ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్…ఇక ఈయన చేసిన ప్రతి సినిమా ఒక మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా క్రేజ్ పరంగా కూడా తనని చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాయనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఆయన చేసిన మాస్ సినిమాలు ప్రేక్షకులని అలరించడమే కాకుండా తాతకు తగ్గ మనవడిగా కూడా అతనికి చాలా మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.
ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనం నుంచి ఆయనకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఒక ఫ్రెండ్ మాత్రం తనని ఎప్పటికీ నీడలా వెంటాడుతూనే ఉంటాడని ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఆయన ఎవరు అంటే రాజీవ్ కనకాల..స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహమైతే కుదిరింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటిస్తూనే బయట కూడా తరచుగా కలుస్తూ ఉండేవారట…
2009 ఎలక్షన్స్ టైం లో టిడిపి పార్టీ తరఫున క్యాంపెయినింగ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆ యాక్సిడెంట్ సమయంలో కూడా రాజీవ్ కనకాల ఎన్టీఆర్ తో పాటుగా ఉన్నాడంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ కి సంభందించిన ప్రతి విషయంలో రాజీవ్ కనకాల ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే రాజీవ్ ని తన ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువగా ఎన్టీఆర్ నమ్ముతూ ఉంటాడు కాబట్టే ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్ మెంట్ అయితే ఉంటుంది. ఇక ఆ చనువుతోనే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్ గా మారింది.
ఇక ఎన్టీఆర్ కి పెళ్లి అవ్వకముందు షూటింగ్స్ లేని సమయంలో వీళ్ళిద్దరూ కలిసి సిటీ అంత తిరిగేవారట. ఇక ఎన్టీఆర్ వాళ్ల ఇంట్లోనే స్వయం గా తన చేతులతోనే రాజీవ్ కనకాలతో పాటు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కి బిర్యానీ వండి పెడుతూ ఉండేవాడట. ఇలా వాళ్ళిద్దరూ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ గానే కొనసాగుతారు అని వాళ్ళ సన్నిహిత వర్గాల వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చెప్తుంటారు…