
వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా మారుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లా పేరు మారుస్తూ రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామన్నారు. వరంగల్, హన్మకొండలో వేర్వేరు కలెక్టరేట్లు నిర్మాణం చేస్తామన్నారు. ఇకపై హన్మకొండ, వరంగల్ జిల్లాలని కేసీఆర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లాకు వెటర్నరీ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ తో వరంగల్ పోటీ పడుతుందని వ్యాఖ్యనించారు. కలెక్టర్ అనే పేరు కూడా మారిస్తే బాగుంటుందన్నారు. బ్రిటీష్ కాలంలో పెట్టిన పేరు కలెక్టర్ అంటూ వ్యాఖ్యానించారు.