
వైసీపీ అధినేత జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే ఆ పార్టీ నాయకులు అలెర్ట్ అవుతారు. విమర్శలు చేసిన వాళ్లు ఆ నాయకులు తిట్లతో కడిగేస్తారు. మొన్నటి వరకు కొడాలి నాని మాత్రమే దూకుడుగా వ్యవహరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ నెల్లూరు మంత్రి అనిల్ కూడా కొడాలి నాని బాటలోనే సాగుతున్నారు. తాజాగా ఆయన లోకేశ్ పై బూతు పురాణం వాడారు. దీంతో వైసీపీలో ఎంత తిడితే అంత పేరొస్తారని కొందరు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ఇటీవల వైసీపీ నేతలను ఓ పదంతో ధూషించారు. దీంతో రెండు రోజుల పాటు వైసీపీ నేతలెవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత కొడాలి నాని తన శైలిలో దూకుడు వ్యవహరించారు. ఇదంతా కామన్ అని ప్రజలకు అర్థమైంది. కానీ కొత్తగా మరో మంత్రి అనిల్ కూమార్ కూడా బూతు పదాలు వాడడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న మంత్రులు ఇలా మాట్లాడడం కొత్తగా చూస్తున్నామని కొందరు చర్చించుకుంటున్నారు.
ఇలా వైసీపీలో విమర్శలు చేయడానికి కొందరు భయపడుతున్నారు. ఎందుకంటే తమ మీద ఆ తిట్లను ఎందుకు పడిపించుకోవడం అని ఊరుకుంటున్నారు. అయితే ఇలా తిట్లతో రియాక్టయ్యే నేతలు టీడీపీలో కనిపించడం లేదు. అయితే ఎమ్మెల్సీ బీటెక్ రవి మినహా ఏ నేత స్పందించలేదు. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు కూడా లోకేశ్ పై బూతులు కడుగుతుంటే స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
దీనిని భట్టి టీడీపీలో ఏ స్థాయిలో యూనిటీ ఉందో అర్థమవుతుందని కొందరు అంటున్నారు. అయితే టీడీపీలో కొందరు విమర్శలు చేస్తున్నా అవి అంత ‘వినసొంపు’గా లేకపోవడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా అధికార పార్టీ నాయకులను తగులుకుంటే తాము ఎక్కడ బూతు పురాణంలో చిక్కకుంటామోనని మౌనంగా ఉంటున్నారు. దీనిని భట్టి పార్టీలో ఏ స్థాయిలో పట్టు ఉందో తెలుస్తుందని అంటున్నారు.