
తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 151 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. www.tslprb.in లో నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చని పోలీస్ నియామక మండలి వివరించింది.