
దేశంలో కరోనా క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,071 కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 2 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్యలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది. నిన్న 18,38,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకూ నిర్వహించిన పరీక్షల సంఖ్య 41.28 కోట్లకు చేరింది.