
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గాయి. గడచిన 24 గంటల్లో 97,863 మంది నమూనాలు పరీక్షించగా 8,110 కేసులు నమోదయ్యాయి. 67 మంది మృతి చెందారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 12,981 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 99,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి.