Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరో గా నటించిన ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) చిత్రం, ఈ సంక్రాంతికి నాలుగు సినిమాల మధ్య విడుదలై సూపర్ హిట్ గా నిలబడడం ట్రేడ్ కి మామూలు జోష్ ఇవ్వలేదు. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి ఈ చిత్రం తో మినిమం గ్యారంటీ హీరో, ఇతని మీద డబ్బులు పెడితే సేఫ్ అనే ధైర్యం నిర్మాతల్లో, బయ్యర్స్ లో నింపాడు. ఒకప్పుడు మాస్ మహారాజా రవితేజ కి ఇలాంటి మార్కెట్ వేల్యూ ఉండేది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అలాంటి హీరో ఇండస్ట్రీ కి వచ్చేసాడు. ఈ సినిమా సూపర్ హిట్ సందర్భంగా నవీన్ పోలిశెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన దేవాలయాలను సందర్శించుకుంటున్నాడు. అందులో భాగాంగా నేడు ఆయన విజయవాడ కి వచ్చి కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాడు. అనంతరం అక్కడికి వచ్చిన మీడియా తో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘జనవరి నెలలో నాకు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ని అందించినందుకు తెలుగు ప్రజలకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన ఈ ఎనర్జీ తో మరో రెండు సినిమాలు ఒప్పుకున్నాను. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఇలాగే ప్రతీ సినిమాతో ఎంటర్టైన్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి కదా, మీ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకం విడుదలకు ముందు ఉన్నిందా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నవీన్ పోలిశెట్టి సమాధానం చెప్తూ ‘ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి అని తెలిసి మొదట్లో కొద్దిగా టెన్షన్ ఉండేది. ఇన్ని సినిమాలా మధ్య మన సినిమాని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం ఉండేది, కానీ ఇంత పెద్ద సక్సెస్ ఇస్తారని అనుకోలేదు. నిన్న ట్రేడ్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఈ సంక్రాంతి 7 తరాలు గుర్తుండిపోయేలా చేశారు అని చెప్పుకొచ్చారు’ అంటూ నవీన్ సమాధానం ఇచ్చాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి తో పోటీ పడ్డారు కదా, ఎలా అనిపిస్తుంది అని నవీన్ ని అడగ్గా ‘మెగాస్టార్ గారితో పోటీ అని నేను చెప్పను. ఆయనతో కలిసి నేను కూడా హిట్ అందుకోవడం ఆనందంగా ఉంది. హుక్ స్టెప్ పాటని చూసి మీరంతా పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు కదా. 70 ఏళ్ళ వయస్సులో కూడా ఆయన ఇంత ఎనర్జీ తో డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ థియేటర్స్ మొత్తాన్ని పండగ వాతావరణం తో జనాలను నింపేసాడు. మాకంటే మూడు రోజుల ముందు చిరంజీవి గారి సినిమా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా ఇచ్చిన ఎనర్జీ ని మేము కొనసాగించాము. చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా మొదటి రోజు బ్లాక్ లో టికెట్స్ కొని వెళ్లి ఎంజాయ్ చేసేవాడిని , అలాంటి మెగాస్టార్ తో ఈ సంక్రాంతిని షేర్ చేసుకొని భారీ హిట్ ని అందుకోవడం నేను జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేను. ఇది తెలుగు ప్రజలు నాకు ఇచ్చిన బహుమతి’ అంటూ చెప్పుకొచ్చాడు.
