T20 World Cup : టి20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంక వేదికగా వచ్చే నెల నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టోర్నీ ఘనంగా నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ అనుసరిస్తున్న తీరు వివాదంగా మారుతోంది. ఈ క్రమంలో ఐసీసీ అకస్మాత్తుగా ఈ వ్యవహారంలోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్ క్రికెట్ మేనేజ్మెంట్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ జట్టు టి20 వరల్డ్ కప్ ఆడుతుందా? లేదా? అనే అనుమానాల వ్యక్తం అవుతున్నాయి.
వాస్తవానికి ఐసీసీకి ప్రధానంగా ఆదాయం టీం ఇండియా నుంచి వస్తోంది. టీమ్ ఇండియాను కాదని ఐసిసి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి తోడు బంగ్లాదేశ్ లేని పంతాలకు పోతున్నది. ఇటీవల జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో నిర్వహించే టి20 వరల్డ్ కప్లో ఆడబోయేది లేదని బంగ్లాదేశ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ స్పందించింది. జనవరి 21 లోపు బంగ్లాదేశ్ జట్టు మేనేజ్మెంట్ తన నిర్ణయాన్ని వెల్లడించాలని సూచించింది. ఒకవేళ బంగ్లాదేశ్ జట్టుకు భారతదేశంలో టి20 వరల్డ్ కప్ ఆడాలని ఇష్టం లేకపోతే ఆ నిర్ణయాన్ని తమకు చెప్పాలని.. ఐసీసీ ఆదేశించింది.
ఒకవేళ బంగ్లాదేశ్ ఆడకపోతే.. ఆ జట్టు స్థానంలో ఎవరు ఆడతారనే ప్రశ్న వ్యక్తమౌతోంది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బంగ్లాదేశ్ జట్టు ఆడకపోతే.. ఆస్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం ఇవ్వాలని ఐసిసి భావిస్తున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆడకపోతే ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే ఆ జట్టు మేనేజ్మెంట్ కు ఆదాయం అంతంతమాత్రంగా వస్తోంది. ఇలానే బంగ్లాదేశ్ గనక పంతాలకు పోతే మొదటికే మోసం వస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ స్కాట్లాండ్ కనుక ఆడితే.. ఆ జట్టు మేనేజ్మెంట్ కు బంపర్ ఆఫర్ లభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయం ఆ జట్టు భవితవ్యాన్ని నిర్దేశిస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
SCOTLAND WILL PLAY IN THE WC 2026 INSTEAD OF BANGLADESH
ICC has asked Bangladesh to inform it of its decision by January 21, otherwise Scotland will play in the World Cup instead of Bangladesh.@ICC @BCBtigers #ISN29 pic.twitter.com/dg1nlA4zFM
— lndian Sports Netwrk (@IS_Netwrk29) January 19, 2026
